Supreme Court: ఈసీ నియామకాలపై సుప్రీంలో అత్యవసర విచారణ, ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభావం పడనుందా

Supreme Court: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఎన్నికల సంఘం నియామకాలపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేయనుండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2024, 07:45 AM IST
Supreme Court: ఈసీ నియామకాలపై సుప్రీంలో అత్యవసర విచారణ, ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభావం పడనుందా

Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమీషనర్ మినహా మిగిలిన రెండు కమీషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల కమీషనర్ల నియామకం కోసం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈలోగా  ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టనుండటం చర్చనీయాంశంగా మారుతోంది. 

కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమీషనర్, ఎన్నికల కమీషనర్ల నియామకం విషంయలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో రెండు ఎన్నికల కమీషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సిన సమయంలో ఈ ఖాళీల్ని భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది. కేంద్ర న్యాయ శాఖ ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు ఈ పేర్లను ప్రధాని మోదీ ప్రకటించనున్నారు. ఈలోగా జరిగిన పరిణామంతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ల నియామకాలు చేపట్టనున్నందున అత్యవసరంగా విచారించాలని డెమోక్రటిక్ అసోసియేషన్ ఫర్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్, ఎన్నికల కమీషనర్ల చట్టం 2023లోని సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. ఈ పిటీషన్‌పై విచారణకు న్యాయస్థానం కూడా సమ్మతించింది. ఈ పిటీషన్లపై అత్యవసరంగా శుక్రవారం అంటే మార్చ్ 15న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

గత నెలలో కేంద్ర ఎన్నికల కమీషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, మరో కమీషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశారు. దాంతో ఈ రెండు స్థానాల ఎంపిక అనివార్యమైంది. ఈ రెండు స్థానాల ఎంపిక తరువాత లోక్‌సభ నోటిఫికేషన్ వెలువడుతుందా లేక ముందే విడుదలవుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. 

వాస్తవానికి ఎన్నికల కమీషనర్ల నియామకాల్ని ప్రధాని నేతృత్వంలోని లోక్‌సభ విపక్షనేత, సుప్రీంకోర్టు సీజేఐ కలిసి చేపట్టాలని 2023 మార్చ్ నెలలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల్ని కాదని కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దాంతో సుప్రీంకోర్టు సీజేఐ స్తానంలో కేంద్రమంత్రి వచ్చి చేరారు. 

Also read: Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి, సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News