Pawan kalyan Comments: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. త్వరలో బీజేపీ సైతం వచ్చి చేరనుంది. ఓ వైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటిస్తుంటే ప్రతిపక్షాల్లో సీట్ల పంచాయితీ రేగుతోంది. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేసినవో పక్కనబెడితే..సీట్ల పంచాయితీకు ఉదాహరణ అని మాత్రం తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేనాని పవన్ కళ్యాణ్ మొన్న రాజమండ్రిలో కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ స్థానం నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ప్రకటించడంతో పాటు అంతకుముందు భీమవరం సభలో రాజకీయాల్లో వయసు మళ్లిన నేతలు తప్పుకోవాలని సూచించడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి ఈ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు మూడోసారి సిద్ధమౌతున్నారు. కూటమిగా ఉన్నప్పుడు జనసేన అభ్యర్దిని ప్రకటించడంతో గోరంట్లకు ఆగ్రహం కలిగింది. ఈ స్థానాన్ని చంద్రబాబు తనకు ప్రకటిస్తే..మద్యలో కందులు దుర్గేష్ ఎవరని కూడా ప్రశ్నించారు. 


ఆ తరువాత భీమవరం సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వయసు మళ్లినవాళ్లు గౌరవంగా తప్పుకోవాలని కోరడం దేనికి సంకేతమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేతల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా అనే సందేహాలు వస్తున్నాయి. అదే నిజమైతే 75 ఏళ్ల చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకు పరితపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వయస్సు మళ్లింది తెలుగుదేశం నేతలకేనా, చంద్రబాబుకు కాదా అని ప్రశ్నిస్తున్నారు. 


రాజమండ్రి రూరల్ పక్కనే ఉన్న రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. రెండు పక్క పక్క నియోజకవర్గాలు కూటమిలో ఒకే పార్టీ పోటీ చేయడం ఏ సమీకరణాల ప్రకారం చూసినా సెట్ కాదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా జనసేన ప్రకటించిన ఇద్దరు అభ్యర్ధులు కూడా కాపు సామాజికవర్గానికే చెందిన నేతలు. పక్క పక్క నియోజకవర్గాల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన నేతల్ని ప్రకటించడం అందులోనూ పొత్తులో ఉన్నప్పుడు ఒకే పార్టీకు కేటాయించడం రాజకీయ సమీకరణాల ప్రకారం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


అందుకే టీడీపీ-జనసేన పొత్తు గోదావరి జిల్లాల్లో సీట్ల పంచాయితీకి కారమమౌతుంది. తాత్కాలికంగా ఇరు పార్టీల నేతలు ఈ సమస్యకు పరిష్కారం సూచించగలిగినా ఓట్ల బదిలీ ఎంతవరకూ అవుతుందనేది ప్రశ్నార్ధకమే.


Also read: AP Hall Tickets 2024: ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు రేపు విడుదల డౌన్‌లోడ్ లింక్ https://aptet.apcfss.in/ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook