Pawan Kalyan Sensational Comments: వారాహి కోనసీమ యాత్రలో పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఓడిపోతానని తెలిసే ఈ పోరాటం
Pawan Kalyan Sensational Comments: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతానని తెలిసే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానంటూ షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Sensational Comments on Varahi Yatra in Konaseema: వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఈసారి జనసైనికులకే షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకున్నానంటూ బాంబు పేల్చారు.
వారాహి యాత్ర సక్సెస్ అవుతోందనే ఆనందం కంటే నాయకుడి వ్యాఖ్యలు, ఆలోచన అర్ధం కాక జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. వారాహి యాత్రంతా కుల, మతాల ప్రస్తావనతోనే సాగిస్తున్న పవన్ కళ్యాణ్ కోనసీమ యాత్రలో మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా గెలుపోటముల గురించి ప్రస్తావించారు. అది కూడా జనసేనకు అడ్డాగా భావిస్తున్న కోనసీమలో జనసైనికులు నిరాశకు లోనయ్యే వ్యాఖ్యానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా క్రిమినల్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి గెలవడం ఖాయమని, ఒకవేళ ఓడినా బాధపడనంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా పట్టించుకోనన్నారు పవన్ కళ్యాణ్.
రాజకీయాలనేవి తనకు రిటైర్మెంట్ ప్లాన్ కాదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వెఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 70/30 శాతంగా ఉందన్నారు. అంటే 100 మంది కష్టాన్ని 30 శాతం మందికే ఇస్తున్నారని గుర్తు చేశారు. బటన్ నొక్కగానే డబ్బులు వచ్చేస్తున్నాయనుకుంటున్న ప్రజలు ఎలా వస్తున్నాయో గమనించాలన్నారు. వందమంది కష్టాన్ని కేవలం 30-40 మందికే ఇస్తున్నారంటూ సంక్షేమ పథకాల్ని విమర్శించారు. రాజకీయాలు చేయడానికి గుండె ధైర్యముంటే చాలన్నారు. తాను మళ్లీ ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ ప్రభుత్వంతో గొడవకు దిగానన్నారు పవన్ కళ్యాణ్.
Also Read: Heavy Rains Alert: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, ఆ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన
ఉభయగోదావరి జిల్లాలకు జనసేన అండగా ఉంటుందని..కోనసీమ అంటే జనసేనకు బలమైనా ఓ వైపు భయం కూడా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేలలో ఆయిల్ ఉందని..ఇక్కడి ప్రజలకు కోపమొస్తే బ్లో అవుట్‌లా పేలతారన్నారు. మనం ఐక్యంగా ఉంటే మార్పు వస్తుందని లేకపోతే వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదని కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడు ప్రభుత్వం నచ్చజెప్పాలన్నారు.
జనసైనికుల్ని ఎన్నికలకు సంసిద్ధం చేయాల్సిన తరుణంలో, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాననే వ్యాఖ్యలు చేయడం జనసైనికుల్లో నిరాశ కల్గిస్తోంది. నాయకుడి మాటలు ఎలా అర్దం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
Also Read: YS Jagan Review: పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో టికెట్, ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి