Janasena: ఎన్నికల్లో పొత్తులపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే..!
Nadendla Manohar: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సీఎం జగన్ బటన్లు నొక్కితే ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో చెప్పాలని ప్రశ్నించారు.
Nadendla Manohar: నాటి జగనన్న నేటి మోసమన్న అయిపోయాడని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఓట్ల కోసం ముద్దులు పెట్టి.. ఎన్నికల కోసం రకరకాల హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం వాటిని పట్టించుకోని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఆదివారం సాయంత్రం పాలకొండ, నరసన్నపేట నియోజకవర్గాల
సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై కూడా నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు నాదెండ్ల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. వైసీపీ విముక్తి కోసం కలిసి రావాలని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారం రాబోయే రోజుల్లో పొత్తులపై ప్రకటన ఉంటుందని చెప్పారు.
"బటన్ నొక్కితే అంతా బాగుపడిపోతుందని ఈ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈయన బటన్లు నొక్కితే ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో.. ఏ ప్రాంతం బాగుపడిందో సీఎం సమాధానం చెప్పాలి. సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలను పూర్తిగా విస్మరించారు. వాటికి కనీస నిధులు రావడం లేదు. 56 కార్పొరేషన్లు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ
ముఖ్యమంత్రి వాటికి నిధులు ఎంత మేర కేటాయించారో సమాధానం చెప్పాలి. ఈ ప్రాంత యువతలో అంతులేని వేదన దాగుంది. తాజాగా యువత ఉపాధి కార్యాలయంలో తమ సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకుంటే ఇచ్చే జాబ్ కార్డు సైతం ఆపేయాలని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే రాష్ట్రంలోని యువత ఉద్యోగంలోనే మగ్గిపోవాలి అని ఈ ప్రభుత్వం భావిస్తుందా..?" అని ఆయన ప్రశ్నించారు.
పాలన విషయాలు పూర్తిగా పక్కన పెట్టి వారాహి వాహనం రంగు గురించి వాళ్లకెందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. దానిని అతిగా చూపించి పాలనను పక్కనపెట్టి ఇప్పుడు.. ఎందుకు ఇంత చర్చ అని అన్నారు. పవన్ కళ్యాణ్ వాహనం రంగు కనిపించినా వీళ్లకు భయమేన్నారు. వ్యక్తిగత దూషణలు, బూతులు పవన్‌ను అడ్డుకోలేకపోయాయన్నారు.
గ్రామాల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కచ్చితంగా గ్రామ సభలకు వెళ్లాలని.. జనసేన జెండా పట్టుకుని గ్రామ సభలో కూర్చోవాలని నాదెండ్ల సూచించారు. కచ్చితంగా గ్రామ అభివృద్ధికి ఏం చేస్తున్నారో ప్రశ్నించాలని చెప్పారు. రాష్ట్రంలో ఇంత అధ్వానమైన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న ముగ్గురు కార్యకర్తలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారికి పార్టీ నుంచి ఆసుపత్రి ఖర్చులో నిమిత్తం బీమా చెక్కులను ఆయన అందజేశారు.
Also Read: CRPC 91: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, కవితకు షాక్, మళ్లీ సీబీఐ నోటీసులు
Also Read: Varahi Vehicle: నిలిచిపోయిన వారాహి వాహన రిజిస్ట్రేషన్, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook