జనసేన పి.ఏ.సి. సమావేశంలో చర్చించనున్న అంశాలు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఈ నెల 25 న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహిస్తారని పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ త్వరలో చేపట్టబోయే `మన నుడి - మన నది`, డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత-భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులపై సమీక్ష జరపనున్నారు.
అమరావతి: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఈ నెల 25 న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహిస్తారని పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ త్వరలో చేపట్టబోయే "మన నుడి - మన నది", డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత-భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులపై సమీక్ష జరపనున్నారు.
ఇవేకాకుండా రాయలసీమలోని పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులూ, క్యాడర్ సమావేశాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.