Pawan Kalyan: పెట్రోల్‌,డీజిల్‌పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో మోదీ సర్కార్ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చమురు ధరల తగ్గింపుతో ప్రజలకు ఉపశమనం కల్గుతుందని చెప్పారు. మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో నిత్యావసర ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకం కింద అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం..పేద వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. 


కేంద్ర ప్రభుత్వ బాటలోనే ఏపీ కూడా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. చమురు ధరలపై ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నులు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. 


ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఐనా రోడ్లను పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఏటా రోడ్డుప్రమాదాల మృతులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్‌పై స్థానిక పన్నులను తగ్గించి ప్రజలకు మేలు చేయాలన్నారు.  


Also read:Virat Kohli Tweet: ఢిల్లీపై ముంబై విజయం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ ట్వీట్!


Also read:Jc Prabhakar Reddy: వైసీపీకి ప్రజాగ్రహం తప్పదు..జేసీ ప్రభాకర్‌ రెడ్డి హాట్ కామెంట్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook