RCB IPL 2022 Playoffs, Virat Kohli Old Tweet to Rohit Sharma Goes Viral afeter MI beat DC: ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ గేమ్ ఒకటి. శనివారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఢిల్లీ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 16 పాయింట్లతో ఇప్పటికే నాలుగో స్థానానికి చేరిన బెంగళూరు.. ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్ చేరకుండా ఢిల్లీకి అడ్డుపడింది.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్ డేవిడ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టుని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన టిమ్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 11 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 34 రన్స్ బాదాడు. టీమ్ ఇన్నింగ్స్ ఢిల్లీ పాలిట శాపం అయింది. కెప్టెన్ రిషబ్ పంత్ అనాలోచిత నిర్ణయం కారణంగా బతికిపోయిన టీమ్.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్‌ను ముగించగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'ధన్యవాదాలు' అనే ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2019లో కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా రోహిత్ బర్త్ డే విషెష్ చెప్పాడు. ఆ సందర్భంలో కోహ్లీ తిరిగి రిప్లై ఇస్తూ ధన్యవాదాలు మిత్రమా అంటూ రోహిత్ శర్మకు బదులిచ్చాడు. ఆ ట్వీటే ఇప్పుడు వైరల్ అయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లియర్ చేసింది. దాంతో రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ థాంక్స్ చెబుతున్నట్లుగా అప్పటి ట్వీట్ వైరల్ అయింది. బెంగళూరు ఫ్యాన్స్ అందరూ కూడా ముంబైకి ధన్యవాదాలుచెబుతున్నారు. అందుకే కోహ్లీ చేసిన పాత ట్వీట్ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరోవైపు సింగపూర్‌కు చెందిన టిమ్ డేవిడ్‌పై బెంగళూరు ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: UP Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది అక్కడిక్కడే మృతి! పలువురికి తీవ్ర గాయాలు
Also Read: IPL 2022 Playoffs: క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లలో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook