Pawan Kalyan's Varahi Vehicle Color: హై కోర్టుతో అనేక సందర్భాల్లో మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల కోసం చేపట్టనున్న యాత్ర కోసం వారాహి పేరిట సిద్ధం చేయించుకున్న వాహనం రంగును కూడా వైసీపీ నాయకులు అవహేళన చేసినట్టు మాట్లాడటం వారి మూర్ఖత్వానికి నిదర్శనం అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేపట్టనున్న యాత్ర వారిని అభద్రతా భావానికి గురిచేస్తోందని.. ఆ అభద్రతాభావంతోనే వారు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. విశాఖలో గురువారం రాత్రి జనసేన ఐటి విభాగం ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఏం చేసినా నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే చేస్తారని గుర్తుచేస్తూ...  ప్రజాధనంతో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించే వారికి నిబంధనల గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజల ఆస్తులకు పార్టీ రంగులు వేసే వారి నుంచి అంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం అని వైసీపీ నేతలకు నాదెండ్ల మనోహర్ చురకలు అంటించారు. 


పవన్ కల్యాణ్ ఆశయాల కోసం పనిచేయండి..
రాబోయే ఏడాదిపాటు జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం కృషి చేయాల్సిందిగా నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ ఐటి ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతిని సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా ఎత్తి చూపుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా వారికి హితబోధ చేశారు. ప్రజల్లో చైత్యం కలిగించి వారికి వైసీపీ ప్రభుత్వం గురించి తెలియజెప్పడమే పరమావధిగా పని చేయాల్సి ఉంటుందని సూచించారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి పవన్ కళ్యాణ్ ప్రచార రథం సిద్ధం.. సరికొత్త పేరు పెట్టిన జనసేనాని


ఇది కూడా చదవండి : Mandous Cyclone: మాండస్ తుపాను, ఏపీ, తమిళనాడులో అతి భారీవర్షాలు


ఇది కూడా చదవండి : Sajjala Ramakrishna Reddy: రెండు రాష్ట్రాలు కలిసేందుకు పోరాటం చేస్తాం.. ఉమ్మడి రాష్ట్రమే మా విధానం: సజ్జల సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook