Pawan Kalyan Bhimavaram Meeting: వైసీపీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడిపోయే పార్టీ అని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆపేశక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం జాతీయ నేతలతో ఎన్నో చివాట్లు తిన్నానని అన్నారు. జగన్‌ సిద్ధం అంటే.. తాము యుద్ధం అంటామన్నారు. మనం యుద్ధం చేయాల్సినంత స్థాయి జగన్‌కు ఉందా అనే డౌట్‌ ఉందన్నారు. ఓటు చీలకుండా చేసే కసరత్తు కోసమే భీమవరానికి దూరంగా ఉన్నానని.. తప్పుడు కేసులు పెట్టిన వారిని మర్చిపోమన్నారు. అన్నీ చక్కబెడతాం.. సరిదిద్దుతామన్నారు. బుధవారం పవన్ కళ్యాణ్‌ భీమవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Janasena vs Tdp: సీట్ల లెక్క తేలకుండానే నేతల మధ్య మొదలైన రాజమండ్రి రూరల్ పంచాయితీ


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? ఓట్లు కొంటారా లేదా అనే నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చును రూ.45 లక్షలకు పెంచింది. అసలు ఓట్లు కొనలేని పరిస్థితి ఉంటే సంతోషం.. దేశమంతా అందమైన అబద్ధంలో వేల కోట్లు ఖర్చు పెడతారు. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు" అని తెలిపారు. 


జగన్ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నపుడే ఏం చేయలేకపోయారని.. తాము విజయం సాధించబోతున్నామని, ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్‌. "2024 ఎన్నికలు అయిపోతే ప్రజలకు గుర్తు కూడా ఉండడు జగన్.. మీ మామయ్య జగన్ రెడ్డి సొంత మేనల్లుడి వివాహానికి డుమ్మా కొట్టి బాధ్యత విస్మరించాడు.. అతను ఉట్టి మామ కాదు కంస మామ. దిగువ స్థాయి నుంచి వచ్చిన మీరు రాజకీయ వారధి కట్టుకుని లక్షల కోట్లకు పడగలెత్తాలి.. ఆంధ్రప్రదేశ్ యువత మాత్రం మీరిచ్చే 5 వేలకి ఊడిగం చెయ్యాలా..?" అని జనసేనాని ప్రశ్నించారు. 


టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు. జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో తనకే తెలుసు అని.. వాళ్లను ఒప్పించడానికి నానా మాటలు పడ్డానని చెప్పారు. రెండు చేతులు జోడించి.. దండం పెట్టి అడిగానని.. తానెప్పుడూ తన కోసం అడగలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అడిగానని.. తిట్టినా భరించానని పేర్కొన్నారు. 


అభివృద్ధి చేసే బటన్లు నొక్కాలని.. అప్పులు చేసి నొక్కడం ఏంటని సీఎం జగన్‌ను ప్రశ్నించారు పవన్. వైఎస్ చాలా కష్టపడి వేల కోట్లు సంపాదించారని.. ఆ ఆస్తిలో సొంత చెల్లి షర్మిలకే సీఎం జగన్ వాటాలు పంచడం లేదన్నారు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం వాటాలు పంచుతారు..? అని నిలదీశారు. కాపుల కోసమే పార్టీ పెట్టలేదని.. అందరి కోసం పెట్టానని అన్నారు. తాను ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదని.. ఎదురుతిరిగి పోరాడే వ్యక్తిని అని స్పష్టం చేశారు.


Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter