Janasena People Attack on Minister RK Roja, Jogi Ramesh Cars: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అధికార వైసిపి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ప్రతిపాదనలను తెరమీదకు తీసుకు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష టీడీపీ అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా ఉండాలని పట్టుపడుతోంది. అయితే జనసేన సైతం అమరావతి రాజధానిగా ఉంచాలనే విషయం మీద ముందు నుంచి మద్దతు పలుకుతోంది. అయితే తాజాగా అమరావతి రైతులు అమరావతి టు అరసవల్లి పేరుతో ఒక పాదయాత్ర చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ పాదయాత్ర విశాఖ మీదుగాన్నే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లికి చేరుకోవాల్సి ఉంది. ఇప్పుడు వైసీపీ విశాఖపట్నం రాజధానిగా వద్దు అని చెబుతూ విశాఖపట్నం నుంచి అరసవిల్లి ఎలా వెళతారు అని చెబుతూ కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు విశాఖపట్నం రాజధానిగా చేయాలి అంటూ పొలిటికల్ నాన్ జేఏసీ ఒకటి ఏర్పాటు అయింది. ఆ పొలిటికల్ నాన్ జేఏసీ విశాఖ గర్జన పేరుతో ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపు నివ్వగా ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ మంత్రులు కొడాలి నాని, విడుదల రజిని, జోగి రమేష్, ఆర్కే రోజా అలాగే ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వంటి వారు పాల్గొన్నారు.


వర్షంలో కూడా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ వాణి వినిపించారు వారంతా. ఇక సరిగ్గా ఇదే రోజు విశాఖపట్నంకి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి  కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్తరాంధ్ర నాయకులతో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారని కొద్ది రోజుల క్రితమే ఒక షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారమే ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అయితే అదే సమయానికి విశాఖ గర్జన పూర్తి చేసుకుని విజయవాడ వెళ్తున్న మంత్రి రోజా, జోగి రమేష్, వైవి సుబ్బారెడ్డి కార్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడానికి వచ్చిన జనసైనికులు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


అక్కడ ఎయిర్ పోర్ట్ గేటు వద్ద ఉన్న కొన్ని రాళ్లు అలాగే బలమైన కర్రలతో కార్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడి వాళ్ళని చెదరగొట్టినట్లుగా చెబుతున్నారు. ఇక విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికిన జనసైనికులు ఆయనను భారీ ర్యాలీగా బయటికు తీసుకు వెళుతున్నారు. ఎయిర్ పోర్టు నుంచి NAD ఫ్లైఓవర్ మీదుగా రోడ్డు మార్గంలో  నోవాటెల్ కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.


ఒకే కారులో  వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ ప్రయాణిస్తున్న సమయంలో అదే కారుపై దాడి జరిగిందని, కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారని, ఇది మంచి పద్ధతి కాదని జోగి రమేష్ పేర్కొన్నారు. జనసేన కార్యకర్తల దాడిలో మా వాళ్లకు దెబ్బలు తగిలాయని జోగి రమేష్ అన్నారు. ఇక అంబటి రాంబాబు వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ప్ పై దాడి విషయంలో పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.


ఇక ఈ అంశం మీద గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ వారు జన సైనికులు కాదు జన సైకోలని అన్నారు. లీడర్ ని బట్టి క్యాడర్ ప్రవర్తన ఉంటుందన్న ఆయన ఈ దాడికి పవన్ బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని, ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.


Also Read: Vizag Garjana Live Updates: పవన్ కు వైజాగ్ అమ్మాయి కావాలి.. కాని రాజధాని వద్దా? మంత్రి రోజా పవర్ పంచ్


Also Read: Unstoppable 2: వెన్నుపోటు ఎపిసోడ్ సమర్ధించేందుకే అన్ స్టాపబుల్ 2 ప్లాన్ చేశారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook