KA Paul Pawan Kalyan: `చూడు పవన్ కల్యాణ్ తమ్ముడూ..` అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA Paul vs Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ ఉద్యమం ప్రారంభించాడు. చట్టపరంగా.. రాజకీయపరంగా కేఏ పాల్ పోరాడుతున్నాడు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పవన్ కల్యాణ్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు.
Also Read: Aara Masthan Vali: ఏపీ ఎన్నికల ఫలితాలు, ఫామ్ 20పై కలక వ్యాఖ్యలు చేసిన ఆరా మస్తాన్ వలీ
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు పత్రం అందించారు. పవన్ కల్యాణ్‌ను 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున పాల్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పిచ్చికుక్క కరిసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసేవిలా ఉన్నాయని చెప్పారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కల్యాణ్ ఉల్లంఘించారని చెప్పారు.
Also Read: AP Fact Check: ఏపీలో మళ్లీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, మొత్తం 30 జిల్లాలు కొత్త జిల్లాలివే
అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారని పవన్ కల్యాణ్ ఆరోపించడం తీవ్ర నేరమని కేఏ పాల్ స్పష్టం చేశారు. 'అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరిలో జరిగింది. అయితే కల్తీ విషయం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జూలై నెలలో బయటపడింది' అని వివరించారు. హిందూ మతాన్ని.. హిందూ సమాజాన్ని అవమానిస్తున్న పవన్ కల్యాణ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులో చేశారు. '40 సంవత్సరాల నుంచి నేను పోలీస్‌స్టేషన్‌కు రాలేదు. మొదటిసారి వచ్చా' అని తెలిపారు.
అయోధ్యకు లక్ష లడ్డూలు పంపామని చెప్పడం తప్పని కేఏ పాల్ స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలను పవన్ కల్యాణ్ కించపరుస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పవన్ కల్యాణ్ పదవి నుంచి దిగిపోవాలి. పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేశారు. పవన్ నోరు మూయించాలని డిమాండ్. 'తమ్ముడూ పవన్ కల్యాణ్ పిచ్చికుక్క లాగా మాట్లాడుతున్నావు' అని పాల్ హెచ్చరించారు. తక్షణమే పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సి.బి.ఐ లకు ఫిర్యాదు కాపీలను పంపనట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి