Fact Check on AP New Districts: 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మొత్తం 26 జిల్లాకు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల్ని మరోసారి విభజించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈసారి మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టుగా ప్రతిపాదన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయంపై ప్రభుత్వం స్పందించింది.
ఏపీలో గత ప్రభుత్వం హయాంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా 26 జిల్లాలుగా మారింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఓ జిల్లా ప్రాతిపదికన 25 జిల్లాలు ఏర్పడాల్సి ఉండగా అరకు పార్లమెంట్ పరిధి 5 జిల్లాల వరకూ ఉండటంతో పరిపాలనా సౌలభ్యం కోసం రెండుగా విభజించారు. మొత్తం 26 ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హఠాత్తుగా జిల్లాలపై దృష్టి సారించి రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంటూ ఓ ప్రతిపాదన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీని ప్రకారం..
ప్రతిపాదనలో కొత్త జిల్లాలు
పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోని
పేరు మార్పు
ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఉన్న మచిలీపట్నం ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లాను తిరిగి కృష్ణా జిల్లాగా మారుస్తారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతున్నారు.
30 జిల్లాల ప్రతిపాదనకు కారణాలేంటి
సమర్ధవంతమైన, సులభమైన పరిపాలనా సౌలభ్యం, ఆర్ధికాభివృద్ధి వికేంద్రీకీరణ కోసం 30 జిల్లాలుగా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అదే సమయంలో జిల్లా ఎకనామిక్ క్లస్టర్ పరిధిలోనే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరో కారణం. 5 ఎకనామిక్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన అభివృద్ధి పర్చడం మరో అంశం. నార్త్ కోస్టల్ ఆంధ్ర, సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర, సౌత్ రాయలసీమ క్లస్టర్, నార్త్ రాయలసీమ క్లస్టర్, వెస్ట్ రాయలసీమ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి.
అయితే ఫ్యాక్ట్ చెక్ చేయగా ఇదంతా అవాస్తవమని తేలింది. ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఇదే పోస్ట్ చేసింది. ఓ వ్యక్తి ఇచ్చిన సలహాను ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించి సమాజంలో అశాంతి రేపేందుకు కొన్ని అల్లరి మూకలు ప్రయత్నిస్తున్నాయని..ఇదంతా పూర్తిగా అబద్ధమని ఖండించింది. ప్రస్తుతం వరకూ ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని తెలిపింది.
Also read: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.