చంద్రబాబు తరహా... ఈసీకి ప్రశ్నలు సంధించిన కేఏ పాల్ !!
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్... ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈసీ పలు ప్రశ్నలు సంధించారు
గత కొన్ని రోజులుగా ఈసీ తీరు తప్పుబడుతూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన స్వరాన్ని మరింత పెంచారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల తీరుపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీన వెళ్లిన పాల్..ఈ మేరకు సీఈసీకి వినతిపత్రం అందించారు. ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచీ లిఖిత పూర్వకంగా సమాధానం కావాలన్నారు .. పాల్ సంధించిన ప్రశ్నలను ఒక్క సారి పరిశీలిద్దాం....
* పోలింగ్ ఆలస్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు..జాప్యానికి కారణం చెప్పండి ?
* పోలింగ్ ప్రక్రియను నిర్ణీత గడవు లోపు పూర్తి చేయకుండా.. అర్థరాత్రి వరకు ఎందుకు కొనసాగించారు ?
* ఈవీఎంలో 12వ ( ప్రజాశాంతి పార్టీ ) బటన్ నొక్కితే 2వ (వైసీపీ) బటన్‌కు ఓటుపడుతోంది.. .దీనిపై వివరణ ఇవ్వగలరా ?
* నూటికి 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచెయ్యలేదు..దీనిపై సమాధానం చెప్పండి ?
* పోలింగ్ పర్యవేక్షకులు దక్షిణాది వారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు నియమించారు ?
* వీవీప్యాట్ స్లిప్పు కు 3 సెకండ్లు ఎందుకు పట్టింది ?
* పోలింగ్ సమయంలో దాడులను ఎందుకు నియంత్రించలేకపోయారు ?
* ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా ఎందుకు తీసుకోలేదు ?