Kadapa district flood highlights: 12 bodies recovered so far from Rajampeta floods in Kadapa district: కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు.. వరదల వల్ల కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం కలిగింది. దాదాపు 30 మంది పైగా వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభించాయి (12 bodies recovered). నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు (Three RTC buses) వరదనీటిలో చిక్కుకున్నాయి. ఒక ఆర్టీసీ బస్సులోని కండక్టర్‌ (Conductor‌), ఇద్దరు ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉద్ధృతికి కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం (Annamayya Reservoir) మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం భారీగా పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. దీంతో చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 


నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది (30 people) చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సులో మూడు మృతదేహాలను వెలికితీశారు. గండ్లూరు శివాలయం సమీపంలో ఏడు, రాయవరంలో మూడు మృతదేహాలు వెలికితీశారు. అయితే వరద ఉద్ధృతిలో 30మంది కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా.. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. అయినా కూడా సహాయచర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నామన్నారు. 


Also Read : IND Vs NZ 2nd T20*: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ LIVE SCORE UPDATES*
ఇక కడప జిల్లా పులపత్తూరు శివాలయంలో (Shiva temple) పలువురు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా ఉప్పొంగింది చెయ్యేరు నది. పూజలు చేస్తున్నవాళ్లు చేస్తున్నట్టుగానే వరద (Floods) ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన భక్తుల (devotees) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పులపత్తూరు శివాలయం దగ్గర గల్లంతైన భక్తుల్లో 11మందిని గుర్తించి పేర్లను ప్రకటించారు అధికారులు. ఈ లిస్ట్‌లో భీము చెంగల్‌రెడ్డి, సింగరాజు వెంకటరాజు, ఎస్‌ శంకరమ్మ, జీ ఆదెమ్మ, బీ పద్మావతమ్మ, బీ భారతి, బీ వెంకట సుబ్బరాజు, పల్లా చెన్నకేశవులు, సంపతి గంగయ్య, సంపతి మల్లయ్య, వీ మహాలక్ష్మి ఉన్నారు.


Also Read : ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎప్పుడు మొదలైంది, చరిత్ర, నేపథ్యం, గ్రీటింగ్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook