Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Ex MLA Jayamangala Venkataramana will Join in YSRCP: కైకలూరులో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Ex MLA Jayamangala Venkataramana will Join in YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీలు మారుతూ.. ముందుగానే బెర్త్‌లు కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. ఇటీవలె అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ టీడీపీ షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు సీఎం జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందుకే జయమంగళం వైసీపీలోకి చేరుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ హామీతోనే సోమవారం సీఎం జగన్ సమక్షంలో జయమంగళం వెంకటరమణ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యేకు నలుగురు గన్‌మెన్లతో ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ కైకలూరు ఇంచార్జ్‌గా జయమంగళ వెంకటరమణ పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కైకలూరు టీడీపీ టికెట్ వేరేవాళ్లకు ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం వైసీపీకి తెలియడంతో క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు సమాచారం.
మరోవైపు ఎమ్మెల్సీ పదవులపై అధికార వైసీపీలోనే చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు తమకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఇలా ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకువచ్చి.. అనూహ్యంగా పదవులు కట్టబెట్టడంపై వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న సీఎం జగన్.. ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పిస్తూ.. అందరికీ సమ న్యాయం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Also Read: CM KCR: ఒక్క మాట నిరూపించండి.. రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్ సవాల్
Also Read: TS Schools Summer Holidays 2023: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook