CM KCR: ఒక్క మాట నిరూపించండి.. రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్ సవాల్

CM KCR Comments On PM Modi: పీఎం నరేంద్ర మోదీ పరిపాలనపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ ఎన్నో మంచి పనులు చేశారని.. కానీ చెప్పులేకపోయారని అన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పడిపోయిందన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 06:04 PM IST
CM KCR: ఒక్క మాట నిరూపించండి.. రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్ సవాల్

CM KCR Comments On PM Modi: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు గుప్పించగా..  ప్రధాని నరేంద్రమోదీపై ఫైర్ అయ్యారు. మోదీ కంటే మన్మోహన్ సింగ్ ఎక్కువ పనులు చేశారని.. అయితే ఆయన ఎక్కువ ప్రచారం చేసులేదన్నారు. మన్మోహన్ సింగ్ ఏం పనిచేయలేదంటూ బీజేపీ దేశవ్యాప్తంగా డప్పు కొట్టి ప్రజలను నమ్మించిందన్నారు. ఈ విషయాన్ని ఎంతో మేధావులు చెప్పారని.. ప్రముఖ ఎకానమిస్ట్ పూజా మెహరా రాసిన ద లాస్ట్ డికేడ్ అనే పుస్తకమే నిదర్శమని అన్నారు.

ప్రస్తుతం దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు సీఎం కేసీఆర్. పవిత్ర దేవాలయం వంటి శాసనసభలో అసలు విషయం పక్కన పెట్టి.. ఇంకేదో మాట్లాడుతున్నారంటూ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అనేక విషయాలను ప్రస్తావించారని.. వాటిపై చర్చిస్తామని చెప్పారు. 
 
దేశంలోని ప్రతి సెక్టార్ నష్టపోయిందని.. అప్పులు భారీగా పెరిగిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. మన్మోహన్ సింగ్ 14 శాతం అప్పులు తగ్గిస్తే.. మోదీ 54 శాతం పెంచారని అన్నారు. బీజేపీ పాలనలో గతంలో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పతనమైందని మండిపడ్డారు. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. వీటిలో ఒక్కటి అబద్ధమైనా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు కేసీఆర్.

ఈ సందర్భంగా అదానీ సంస్థలపైనా కేసీఆర్ మాట్లాడారు. అదానీ వ్యవహారం చూస్తుంటే దేశ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదని అన్నారు. ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. అదానీ ఆస్తులు కరిగిపోయాయని.. చాలా బ్యాంకులు, ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టాయన్నారు. మోదీ స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అదానీ కంపెనీ పెడతామన్నారని.. కానీ మనం స్థలం చూపించలేకపోయామన్నారు. అలా వాళ్లు పెట్టుబడులు పెట్టులేదు.. బతికిపోయామని సీఎం అన్నారు. 

Also Read: Hyderabad Fake Baba: దెయ్యం పట్టిందంటూ యువతులకు దొంగ బాబా వల.. 8వ పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్  

Also Read: Maha Shivratri 2023: మహా శివరాత్రి స్పెషల్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News