Kakinada: సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే .. సంక్షేమ పథకాలను ఆపేస్తామంటూ బెదిరింపులు..
Kakinada MLA Sensational Comments: కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమంలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తేనే ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయని.. లేదంటే ఆపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Kakinada MLA Sensational Comments: ప్రజలే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల కంటే ప్రజాప్రతినిధులకే ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ప్రజల చేత ఎన్నుకోబడతారు. అందుకే కొందరు ప్రతినిధులు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వారికి చేతనైనా ఎంత సహాయం చేస్తూ ఉంటారు. ఇంకొందరు అక్రమ మార్గాల్లో నడుస్తూ ఉంటారు. అయినాప్పటికీ ప్రజలు తమకు ఉచిత పథకాలు ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి అనుకుంటారు. అయితే ఇటీవలే ఓ ప్రజా ప్రతినిధి మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపుతున్నాయి.
తనకు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తేనే ఉచిత పథకాలు అందుతాయని లేకపోతే అన్ని ఆపేస్తామంటూ బహిరంగంగా ప్రజలను హెచ్చరించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.
కాకినాడ నియోజకవర్గం లోని అధికార ప్రతినిధులు ప్రజలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్వత పూర్ణ చంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వమనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మీరంతా వైసీపీ గుర్తైనా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని లేకపోతే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తామని అక్కడి ప్రజలను ఆయన హెచ్చరించారని సమాచారం. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
తీవ్రంగా ఖండిస్తున్న టీడీపీ నేతలు:
అన్నవరంలో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలకు మంచి చేయాల్సిన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఎవరు ఆపలేరని టీడీపీ నేతలన్నారు.
Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి