Kodali Nani Sensational Comments On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారని, రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చేస్తారని అంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తీవ్రవాది అయితే ఏం చేస్తాడు? అని ప్రశ్నించిన నాని వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ కళ్యాణ్ ప్రజలను చంపేస్తాడా?? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ గళాన్ని వినిపించటానికి రోడ్డెక్కే ప్రజలను పవన్ కళ్యాణ్ తీవ్రవాది అయి ఏం చేస్తాడు?? అని ప్రశ్నించిన కొడాలి నాని రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటానికే మూడు ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకున్నామని అన్నారు. అయితే అసలు రాష్ట్ర విభజనకు వత్తాసు పలికిన పార్టీల చంక ఎందుకు ఎక్కాడు?? అని ప్రశ్నించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం లక్షల కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడతాం అంటున్నారు, రేపు ఈ ప్రాంతంలో ఉన్న నా లాంటి వాళ్ళు పొమ్మంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది?? అని ఆయన ప్రశ్నించారు.


అసలు బాబు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది?? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని పేర్కొన్న కొడాలి నాని మాకు 55 శాతం ఓటు బ్యాంకు ఉందని అన్నారు. అందరూ కట్ట కట్టుకొని వచ్చినా వెంట్రుక కూడా పీకలేరన్న నాని బతికి ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రని అన్నారు.


అభివృద్ధి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఫారిన్ అమ్మాయిలను పెట్టుకుని మందు తాగటమా?? అంటూ నారా లోకేష్ ను ఎద్దేవా చేశారు. గుడివాడలో క్యాసినో ఉందని రాష్ట్రపతి నుంచి ఈడీ వరకు అందరికీ లేఖలు రాశారు?? ఏమయ్యింది?? ఎవరైనా నా చిటికెన వేలు వెంట్రుక అయినా పీక గలిగారా?? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఒక 420, లోకేష్ 120 అని పేర్కొన్న కొడాలి నాని పాదయాత్రలే కాదు పొర్లు యాత్రలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. 
Also Read: Akkineni Thokkineni : కించపరచడం కోసం అలా అనలేదు.. ఆయన దగ్గరే నేర్చుకుని ఆయన్నే అంటానా?
Also Read: Balakrishna Dabidi Dibide: వాడికి దబిడి దిబిడే.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook