Akkineni Thokkineni : కించపరచడం కోసం అలా అనలేదు.. ఆయన దగ్గరే నేర్చుకుని ఆయన్నే అంటానా?

Balakrishna Responds on Controversy: అక్కినేని తొక్కినేని అంటూ తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో ఎట్టకేలకు బాలకృష్ణ స్పందించారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 26, 2023, 02:04 PM IST
Akkineni Thokkineni : కించపరచడం కోసం అలా అనలేదు.. ఆయన దగ్గరే నేర్చుకుని ఆయన్నే అంటానా?

Balakrishna Responds on Thokkineni Controversy: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ జరిగి చాలా రోజులు అవుతుంది కానీ, ఇంకా అది ఏదో ఒక రకంగా వార్తల్లోకి వస్తూనే ఉంది. దానికి కారణం ఈ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్ చేయడమే. తన సహనటుడు గురించి ప్రస్తావిస్తూ నందమూరి బాలకృష్ణ ఈయనతో కూర్చుంటే అసలు కాలమే తెలియదు, వేదాలు -పురాణాలు, ఆ రంగారావు ఈ రంగారావు, మా నాన్నగారు, డైలాగులు, అక్కినేని- తొక్కినేని అంటూ ఎక్కడ దాకానో మా చర్చ వెళుతుంది అంటూ కామెంట్ చేయడం పెద్ద వివాదాస్పదంగా మారింది.

ఈ విషయంలో అక్కినేని నాగేశ్వరరావును ఆయన వర్ధంతి రోజే అవమానించారు అంటూ అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని లేదంటే తాము చేపట్టే నిరసన కార్యక్రమాలకు బాధ పడాల్సి వస్తుంది అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కాపునాడు అనే మరో సంస్థ ఎంట్రీ ఇచ్చి కాపు కులస్తుడు అయిన ఎస్వీ రంగారావును కించపరచడం ఏ మాత్రం బాలేదని క్షమాపణలు నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పాలని లేదంటే నారా లోకేష్ పాదయాత్ర అడ్డుకుంటామని హెచ్చరించింది.

అయితే ఈ విషయం మీద బాలకృష్ణ ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఆయన ఈ విషయంలో స్పందించక పోవచ్చు అని అందరూ భావించారు. కానీ తాజాగా హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నేను అక్కినేనిని కించపరిచే విధంగా మాట్లాడలేదని వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో యాదృచ్ఛికంగా అలా అన్నానని చెప్పుకొచ్చారు. తాను అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్ అని పిలుస్తానని పేర్కొన్న బాలకృష్ణ తన పిల్లల కంటే ఎక్కువగా నాపై ఆయన ప్రేమ చూపించేవారని అన్నారు.

పొగడ్తలకు పొంగిపోకూడదు అనే విషయాన్ని తాను అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నానని ఈ సందర్భంగా బాలకృష్ణ వివరణ ఇచ్చారు.  ఇక ఇదే విషయం మీద నందమూరి అభిమానులు కూడా కొద్ది రోజులుగా నందమూరి బాలకృష్ణ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య మొదటి సినిమా ఫంక్షన్ కి కూడా ఆయన వెళ్లారని అప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావుని బాబాయి అనే ప్రస్తావిస్తూనే తాను అక్కినేని నాగచైతన్యకు బాబాయ్ అవుతానని చెబుతూ ఆశీర్వదించారని అలాంటి వ్యక్తి పొరపాటున అని ఉంటారు తప్ప కావాలని అని ఉండారని వారంతా చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ స్వయంగా ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం సమసిపోయే అవకాశం కల్పిస్తోంది.
Also Read: Pathaan Day 1 : దుమ్ము రేపిన పఠాన్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వార్లో అలాంటి రికార్డు!

Also Read: Balakrishna Dabidi Dibide: వాడికి దబిడి దిబిడే.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News