ఏపీ మాజీ స్పీకర్ కోడెల, ఆయన కుమారుడిపై కేసు నమోదు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల, ఆయన కుమారుడిపై కేసు నమోదు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అసెంబ్లీలో అధికారిక అవసరాల కోసం కేటాయించిన ఫర్నీచర్‌ను ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు దారి మళ్లించి తన ఇంటికి, తన కుమారుడు శివరామ కృష్ణ ఇంటికి తరలించారని అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని విచారణకు స్వీకరించిన పోలీసులు.. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చేశారు.
కోడెల శివప్రసాద్ రావుతో పాటు ఆయన కుమారుడు శివరామకృష్ణపై సైతం ఐపీసీ సెక్షన్ 409, 411ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.