కృష్ణా: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొనడంపై నిరసన వ్యక్తంచేస్తూ కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక దీక్షకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో మచిలిపట్నంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. 


అయితే, ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్ విధించినందున ఎటువంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు. చట్టాన్ని ఎవ్వరు అతిక్రమించినా చర్యలు తప్పవని పోలీసులు తేల్చిచెప్పారు. ఇదిలావుంటే, మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని సైతం పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.