కృష్ణానదికి వరద పోటు, నిండుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లు
Krishna Floods: నదీ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుతోంది. డ్యామ్ గేట్లను పూర్తిగా తెరిచి..మొత్తం వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
Krishna Floods: నదీ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుతోంది. డ్యామ్ గేట్లను పూర్తిగా తెరిచి..మొత్తం వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నది వరద(Krishna Floods) నీటితో పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యామ్ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు అంటే నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఆదివారం రాత్రికి 207 టీఎంసీల నీటి ప్రవాహముండగా..నీటి మట్టం 883.50 అడుగులకు చేరింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు(Srisailam Project) ఎగువన జూరాల, సుంకేసుల నుంచి 5 లక్షల 29 వేల 963 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంకు వచ్చి చేరుతోంది.ఇప్పటికే నాగార్జునసాగర్ నిండి ఉండటంతో మొత్తం గేట్లను తెరిచి దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్(Nagarjuna sagar dam) నుంచి దిగువకు వదులుతున్న 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజ్‌కు చేరనుంది. ఈ నేపధ్యంలో ప్రకాశం బ్యారేజ్(Prakasam Barrage) దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యేడాదితో పోలిస్తే నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లను ముందుగానే తెరిచారు. అటు నాగార్జునసాగర్ టెయిల్‌ఎండ్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 1 లక్షా 86 వేల 175 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు వదులుతున్నారు.
Also read: కరోనా సంక్షోభంలో సైతం కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook