Vijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ
Krishna River Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి కొనసాగిన ప్రవాహంలో భారీగా తగ్గుదల కనిపించడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Krishna River Water Flow: రెండు రోజులుగా బెజవాడను వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కొంత శాంతించింది. ఉప నదులను కలుపుకుని ఉప్పొంగుకున్న కృష్ణా నది ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో విజయవాడ కొంత ఊపిరి పీల్చుకుంది. ప్రవాహం మరింత పెరిగితే విజయవాడలో భయానక పరిస్థితులు ఏర్పడతాయనే వార్తలతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు వరద తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట చెందారు. అయితే మళ్లీ వర్షాలు పడితే మాత్రం ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా వర్షం ముప్పు.. రేపు కూడా సెలవు ప్రకటన
ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీనికి తోడు వాగులు, వంకల నుంచి భారీగా వరద రావడంతో ఆదివారం ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో విజయవాడ జలదిగ్బంధమైంది. రాత్రికి పరిస్థితి మరింత పెరగడంతో ప్రకాశం బ్యారేజీని ఆనుకుని వరద ప్రవహించింది. అయితే సోమవారం ఉదయం అదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగగా మధ్యాహ్నం తగ్గింది. కొన్ని గంటలుగా కృష్ణమ్మ శాంతించింది.
Also Read: Vijayawada Floods: వరదల్లో శుభ పరిణామం.. బోటులోనే పండంటి బాబుకు జననం.. ఏం పేరు పెడదాం?
ప్రవాహం ఇలా..
సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు 30 వేల క్యూసెక్కుల మేరకు వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. 30 వేల క్యూసెక్కుల వరద నీరు తగ్గుముఖం పట్టడంతో విజయవాడలో కొంత వరద ముప్పు తగ్గింది. ఆదివారం, సోమవారం ఉదయం దాకా కొనసాగిన 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 12 లక్షలకు చేరి ఉంటే మాత్రం ప్రకాశం బ్యారేజీ ప్రమాదకర స్థాయికి చేరి ఉండేది. విజయవాడ మొత్తం మునిగిపోయి ఉండేది. ఇప్పటికే బ్యారేజ్ ప్రవాహం తట్టుకోలేక కొన్ని గేట్లు కూలిపోయిన విషయం తెలిసిందే.
సహాయ చర్యలు ముమ్మరం
క్రమంగా ఇదే రీతిన ప్రవాహం తగ్గుముఖం పడితే విజయవాడలో వరద పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. సహాయ చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి వీలు దక్కుతుంది. కాగా వరదలతో అల్లాడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చర్యలు చేపడుతోంది. ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతోంది. ఇక వరదల్లో చిక్కుకున్న బాధితులను సురక్షిత కేంద్రాలకు తరలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర సహాయ బృందాలు సమన్వయం చేసుకుంటూ విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలు చేపడుతుండడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter