Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా వర్షం ముప్పు.. రేపు కూడా సెలవు ప్రకటన

Tomorrow Also Declared Holiday To All Educational Institutes: అల్పపీడనం బలహీనమైనప్పటికీ వర్షం ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపు కూడా సెలవు ప్రకటించారు. అయితే...

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 2, 2024, 06:18 PM IST
Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా వర్షం ముప్పు.. రేపు కూడా సెలవు ప్రకటన

Schools And Colleges Holiday: రోజురోజుకు పరిస్థితి భయానకంగా మారుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అల్లాడుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముఖ్యంగా విజయవాడ, కృష్ణా, గుంటూరు ప్రజలు విలవిలలాడుతున్నారు. విజయవాడ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరిన్ని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

Also Read: Vijayawada Floods: వరదల్లో శుభ పరిణామం.. బోటులోనే పండంటి బాబు జననం.. ఏం పేరు పెడదాం?

అయితే ఈ సెలవు వరద ప్రభావిత జిల్లాలకు మాత్రమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వరదలు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో తీవ్రంగా ఉంది. రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ గుంటూరు కలెక్టర్ నిర్ణయం వెలువరించారు. ఈ నెల 3వ తేదీన మంగళవారం కూడా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయని.. మరికొన్ని చోట్ల ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని తెలిపారు. అయితే వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకు

పొంచి ఉన్న వర్షం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం కొంత తెరపి పడింది. అయితే వర్షం ప్రభావితం మాత్రం తీవ్రంగా ఉంది. చాలా వాగులు, వంకలు ఇంకా పొంగి పొర్లుతున్నాయి. వరద పరిస్థితి కొనసాగుతోంది. బ్రిడ్జిలు, రోడ్లు ప్రమాదకరంగా మారాయి. దీనికితోడు మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మంగళవారం కూడా సెలవు ప్రకటించింది. అయితే వరద తీవ్రంగా ప్రభావితమైన కృష్ణా జిల్లాలో కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. విజయవాడలో కొన్ని రోజుల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పట్టణంలో కూడా సెలవు ప్రకటించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News