Krishnapatnam ayurvedic medicine: హైదరాబాద్‌కు కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు శాంపిల్స్
Krishnapatnam ayurvedic medicine for Coronavirus: నెల్లూరు: కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం పేరిట చేస్తోన్న ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక అధికారులు నిలిపేశారు. కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ అనగానే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు.
Krishnapatnam ayurvedic medicine for Coronavirus: నెల్లూరు: కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం పేరిట చేస్తోన్న ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక అధికారులు నిలిపేశారు. కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ అనగానే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు. భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ రద్దీ పెరిగి కొవిడ్ గైడ్ లైన్స్ అమలు పర్చడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీపై వివరాలు ఆరా తీసిన సీఎం జగన్.. శాస్త్రీయ ఆధారాలు లేనిదే పంపిణీ చేయకూడదని.. అందుకోసం అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు కృష్ణపట్నంలో ఆయుర్వేద ఔషధం పంపిణీ నిలిచిపోయింది.
Also read : India Corona Deaths: భారత్‌లో మళ్లీ పెరిగిన COVID-19 మరణాలు, పాజిటివ్ కేసులు తగ్గుముఖం
కృష్ణపట్నంలో పంపిణీ చేస్తోన్న ఔషధానికి (Coronavirus ayurvedic medicine) సంబంధించి శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాద్‌లోని ఓ ప్రయోగశాలకు పంపించినట్టు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మీడియాకు తెలిపారు. కరోనా ఔషధంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) సైతం శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధన ఫలితాల ఆధారంగానే ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కలెక్టర్ చక్రధర్ బాబు తేల్చిచెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook