హైదరాబాద్‌ : తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రప్రజలను కొడుతున్నారని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నిక్షేపంగా వున్నారని ట్వీట్ చేసిన కేటీఆర్.. పవన్‌ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177642","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఏపీలో భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తోన్న పవన్ కల్యాణ్.. ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. 'మనం ఇక్కడ మతాలుగా, కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం.. కానీ తెలంగాణలో ఆంధ్రవాళ్లంటే అలుసు.. కుల, వర్గ విభేదాలు లేకుండా మన వాళ్లను కొడుతున్నారు' అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.