Kakinda Port: కాకినాడ పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం చూస్తుంటే ఎవరూ అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిని అంతకంటే పెద్ద స్థాయి వారే ఆపారా? అని అనుమానాలు లేవనెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారం


కాకినాడ పోర్టులో పవన్‌ కల్యాణ్‌ సృష్టించిన హంగామాపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ తీరుపై విమర్శలు చేశారు. 'పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పి.. పట్టుకున్న బియ్యమే మళ్లీ విడుదల చేశారు' అని వివరించారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏమిటని ప్రశ్నించారు.

Also Read: JC Prabhakar Reddy: 'అనంత వెంకట్రామిరెడ్డి కాస్కో.. నీ ఇంటి గేట్లు పగలగొడతా'


'పౌరసరఫరాల శాఖ చెక్‌పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి? బియ్యం ఉన్న షిప్పులోకి వెళ్తానంటే తనను వెళ్లనీవడం లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి' అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు.


'ఉప ముఖ్యమంత్రినే షిప్పులోకి ఎక్కకుండా ఆపారా? అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే? కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు  ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?' అని కన్నబాబు సందేహం వ్యక్తం చేశారు. 'కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి ఉప ముఖ్యమంత్రిని ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు' అని ప్రశ్నలు లేవనెత్తారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter