Kurnool జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే 14 మంది దుర్మరణం
Kurnool Road Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Kurnool Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవదర్శనానికి వెళ్తున్న వారు విగతజీవులుగా మారడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నాయి. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని మాదాపురం వద్ద అదుపుతప్పిన టెంపో వాహనం రోడ్డు డివైడర్ దాటి అవతలి మార్గంలో వెళ్తున్న ఓ లారీని వేగంగా ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలు సహా మొత్తం 14 మంది చనిపోగా, మరికొందరు తీవ్రగాయాల పాలయ్యారు.
Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 14, 2021 Rasi Phalalu
చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబం రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా.. హైదరాబాద్(Hyderabad)-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. టెంపో డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగా వాహనం అదుపుతప్పి ఢివైడర్‌ను దాటి లారీని ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Second phase panchayat results: ఏపీ రెండోదశ పంచాయితీల్లో కూడా వైసీపీదే హవా
ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 18 మంది టెంపోలో ప్రయాణిస్తున్నారు. అందులో గాయపడ్డ నలుగురిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీని ఢీకొట్టడంతో టెంపో వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయం కోసం లారీ డ్రైవర్ కేకలు వేయడంతో స్థానికులు సహాయం చేశారు.
Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో టెంపో వాహనాన్ని పక్కకు జరిపి, అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook