Second phase panchayat results: ఏపీ రెండోదశ పంచాయితీల్లో కూడా వైసీపీదే హవా

Second phase panchayat results: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల రెండో పర్వం పూర్తి కావస్తోంది. రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారపార్టీ హవా స్పష్టంగా కన్పిస్తోంది. తొలిదశలో చూపించిన ఆధిక్యతనే రెండో దశలోనూ కనబరుస్తోంది. 

Last Updated : Feb 13, 2021, 07:33 PM IST
  • రెండవ దశ పంచాయితీ ఎన్నికల్లో సైతం అధికార పార్టీ హవా
  • 645 పంచాయితీల్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
  • 27 స్ఖానాల్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ
Second phase panchayat results: ఏపీ రెండోదశ పంచాయితీల్లో కూడా వైసీపీదే హవా

Second phase panchayat results: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల రెండో పర్వం పూర్తి కావస్తోంది. రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారపార్టీ హవా స్పష్టంగా కన్పిస్తోంది. తొలిదశలో చూపించిన ఆధిక్యతనే రెండో దశలోనూ కనబరుస్తోంది. 

ఏపీ గ్రామ పంచాయితీ రెండవ దశ పోలింగ్ ( Ap second phase Panchayat polling ) ముగిసింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై..మద్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ సాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇక కౌంటింగ్ ఫలితాల్ని ( Panchayat results ) పరిశీలిస్తే..రెండవ దశలో కూడా అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. తొలిదశలో ( First phase ) 80 శాతం పంచాయితీలు కైవసం చేసుకున్న వైసీపీ..రెండవ దశలో కూడా మెజార్టీ పంచాయితీల్ని కైవసం చేసుకుంటోంది. రెండవ దశలో 2 వేల 786 పంచాయితీలు, 20 వేల 817 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 539 పంచాయితీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇక 7 గంటల వరకూ అందిన ఫలితాల ప్రకారం వైసీపీ మద్దతుదారులు 645 పంచాయితీల్ని కైవసం చేసుకోగా..తెలుగుదేశం మద్దతుదారులు 27 పంచాయితీల్లో గెలిచారు. 

జిల్లాల వారీగా వైసీపీ, టీడీపీ మద్దతుదారులు గెలిచిన స్థానాలు

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 44, స్థానాల్లో గెలవగా..టీడీపీ ఇంకా బోణీ కొట్టలేదు. విశాఖపట్నంలో వైసీపీ మద్దతుదారులు 22 స్థానాల్లో..తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ( Ycp ) బలపర్చిన అభ్యర్ధులు 19 మంది, టీడీపీ మద్దతుదారులు ఒక స్థానంలో విజయం సాధించారు. కృష్ణా జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 39, టీడీపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో  వైసీపీ మద్దతుదారులు 76 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు 7 స్థానాల్లో గెలిచారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 75 స్థానాల్లో, టీడీపీ ( TDP) మద్దతుదారులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 41 స్థానాల్లో, టీడీపీ మద్దతుదారులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 67 స్థానాల్ని దక్కించుకున్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ 22 స్థానాల్లోనూ, టీడీపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 51 స్థానాన్ని టీడీపీ 6 స్థానాల్ని గెల్చుకున్నాయి. కడపలో వైసీపీ మద్దతుదారులు 37 స్థానాల్లోనూ, టీడీపీ  2 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 17 స్థానాల్ని ఇప్పటికే దక్కించుకుంది. 

Also read: Ap panchayat elections 2021: ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవ దశ పోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News