MP Avinash Reddy Mother Health Bulletin: కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. దీంతో కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి దగ్గరలో అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితం మే 22న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇవ్వగా.. తన తల్లి శ్రీలక్ష్మికి ఆరోగ్యం బాలేదని పది రోజులు గడువు అడిగారు అవినాష్ రెడ్డి. అయితే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తిరస్కరించారు. కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని ఆదేశించారు. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు సీబీఐ అధికారులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులిటెన్‌ను విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు రిలీజ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. హార్ట్ అటాక్‌కు గురయ్యాయరని తెలిపారు. గుండెకు సంబంధించిన సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు పేర్కొన్నారు. శ్రీలక్ష్మికి యాంజియోగ్రామ్ చేశామని.. డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలిందన్నారు. ఆమెకు సీసీయూ ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బీపీ తక్కువగా ఉందని.. అయానోట్రోపిక్ సపోర్ట్‌పై ఉన్నారని పేర్కొన్నారు. ఆమెకు మరికొన్ని రోజులు సీసీయూలోనే చికిత్స అందించనున్నట్లు తెలిపారు. 


విశ్వభారతి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశ్వభారతి ఆసుపత్రి మార్గంలో రాకపోకలు నిషేధించారు. కొత్త వ్యక్తులు ఎవరినీ ఆసుపత్రిలోకి పంపించడం లేదు. పేషంట్ల సంబంధీకులను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో కర్నూలులో ఏం జరుగుతోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


మరోవైపు బెయిల్ పిటిషన్‌పై మరోసారి సుప్రీంకోర్ట్‌ను ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహల బెంచ్ పిటిషన్‌ను పరిశీలించి.. మరో వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని ఆదేశించింది. తిరిగి మళ్లీ కోర్టు నె౦.4లోని బెంచ్‌కు అవినాష్ రెడ్డి లాయర్లు వెళ్లారు. తల్లి అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌లోనే అవినాష్ రెడ్డి హాస్పిటల్‌లో ఉన్నారు.


Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?  


Also Read: Avinash Reddy Arrest: కర్నూలులో హై టెన్షన్, ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డి అరెస్టు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook