Land grab case against TDP MP Galla Jayadev and Galla family members: అమరరాజా సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో ( TDP MP Galla Jayadev) పాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, (Galla Aruna Kumari) గల్లా రామచంద్రనాయుడుతో (Galla Ramachandra Naidu) పాటు 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు (chittoor) జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ సెక్షన్ల కింద వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు (rajagopal naidu) పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని కూడా ఆక్రమించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమిని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని ఆయన చెప్పారు. తన భూమికోసం గోపీకృష్ణ (Gopi Krishna) 2015 నుంచి ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో రెండు నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : CJI NV Ramana: టీటీడీలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు - సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు ట్రస్ట్‌ సంబంధీకులతో పాటు ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, చైర్‌పర్సన్‌ గల్లా అరుణకుమారి, (Galla Aruna Kumari) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev), సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు.


Also Read : Bengaluru: డ్రగ్స్ దందాలో నైజీరియన్ నటుడు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి