Hero Teaser: మహేశ్ మేనల్లుడు హీరో టీజర్‌కు విశేష స్పందన, 4 మిలియన్ల వ్యూస్

Hero Teaser: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రం చేయనున్నాడు. మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ తొలి చిత్రం టీజర్ సంచలనంగా మారింది. అప్పుడే మిలియన్లలో వ్యూస్ వచ్చి పడుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2021, 07:21 PM IST
 Hero Teaser: మహేశ్ మేనల్లుడు హీరో టీజర్‌కు విశేష స్పందన, 4 మిలియన్ల వ్యూస్

Hero Teaser: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రం చేయనున్నాడు. మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ తొలి చిత్రం టీజర్ సంచలనంగా మారింది. అప్పుడే మిలియన్లలో వ్యూస్ వచ్చి పడుతున్నాయి.

టాలీవుడ్‌లో (Tollywood)మరో సినీ కుటుంబం నుంచి హీరో పరిచయం కాబోతున్నాడు.సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అమరరాజ మీడియా అండ్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్ హీరో కావడం విశేషం. అసలు విశేషమేమంటే తొలిచిత్రం టీజర్‌తోనే జనంలో మంచి ఆదరణ సంపాదించుకోవడం. మహేశ్ బాబు (Mahesh babu) విడుదల చేసిన హీరో టీజర్ (Hero Movie Teaser) అప్పుడే 4 మిలియన్ల వ్యూస్ దాటేసింది. హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌లో అశోక్..కౌబాయ్ గెటప్‌లో కన్పించాడు. గుర్రంపై ట్రైన్‌ను ఫాలో అవుతూ అశోక్ ఎంట్రీ టీజర్‌లో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. 

శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా..జిబ్రాన్ సంగీతం అందించాడు. టీజర్‌లో అశోక్ మొత్తం మూడు పాత్రల్లో కన్పించనుండటం విశేషం. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిశోర్ ముఖ్యపాత్రలో కన్పించనున్నారు.

Also read: RRR Movie Resumes Shoot: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం, సెట్లో చేరిన తారక్, చెర్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News