అమరావతి: ఫ్యాక్షన్ పోకడలతో ప్రజలే నష్టపోతున్నారని, నాయకులు బాగానే ఉన్నారని, భయపెడితే పెట్టుబడులు ఎలా వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కియా కార్ల కంపెనీ తరలిపోయే పరిస్థితి తీసుకువచ్చారని, పథకాల పేరుతో ఒక చేత్తో డబ్బులిచ్చి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మరో చేత్తో లాగేసుకొంటున్నారని వైస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ప్రతిపక్షంలో ఉన్న నేటి ముఖ్యంత్రి వై ఎస్ జగన్మోహాన్ రెడ్డి, రాజధానికి అమరావతిలో 30 వేల ఎకరాలు కావాలన్నారు, ఇప్పుడెందుకు మాట మార్చారని ఆయన అన్నారు. ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు  సీఏఏ, ఎన్ఆర్సీల వల్ల ఇబ్బందులు ఎదురుకావని అన్నారు. 


నాయకుల ఫ్యాక్షన్ పోకడల మూలంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వచ్చిన కియా కార్ల కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితి దాపురించిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పెట్టుబడి దారులను భయపెడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి ఫ్యాక్షన్ విధానాల వల్ల నష్టపోయేది ప్రజలే కానీ... నాయకులు కాదన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ నేల కాదని, చదువుల నేల సరస్వతి ఉన్న నేల, పూర్వం ఈ ప్రాంతంలో ఏ విలువలైతే రాజ్యమేలాయో, ఆ విలువలను తీసుకురావడానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..