Navodaya Old Students presented car to Teacher In Andhra Pradesh: మన హిందు సంప్రదాయంలో గురువులకు ఎంతో గౌరవిస్తారు. గురువులకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. రాముడికి విశ్వమిత్రుడు, శ్రీకృష్ణుడికి సాందీపుడు, అర్జునుడికి ద్రోణాచార్యుడు.. ఇలా మహాభారత, రామాయణం కాలాలలో కూడా గురువు గొప్పతనం నుంచి తెలుసుకుంటు వస్తున్నాం. ఎంతటి అవతార పురుషులైన కూడా గురువుదగ్గర విద్యాబుద్ధులు, అనేక యుద్ద కళలు నేర్చుకునతర్వాతే జీవితంలో గొప్పగా రాణించారు. అందుకు మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాత అంతనటి గొప్ప స్థానాన్ని గురువుకు ఇచ్చారు. గురువులేని విద్యను గుడ్డి విద్యఅని కూడా చెబుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కనిస్కూల్ లో నేర్పించి, మంచిగా విద్యాబుద్దులు నేర్పించాలని కూడా చెబుతుంటారు. అదే విధంగా గురువులు పాఠశాలలో పాఠాలతో పాటు,కొందరు ఉపాధ్యాయులుజీవిత పాఠాలను కూడా నేర్పిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..


ఇంట్లో కన్న ఎక్కువగా పిల్లలు పాఠశాలలో ఎక్కువసేపు ఉంటారు. తమ స్టూడెంట్ దేనిలో మంచి టాలెంట్ చూపిస్తున్నారు. ఏరంగంలో వెళితే జీవితంలో గొప్పగాఎదుగుతాడని ఉపాధ్యాయులు ఇట్టేచెబుతుంటారు. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధతో తమ స్టూడెంట్స్ అన్ని రంగాల్లో రాణించేలా చూస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొందరు స్టూడెంట్లు మాత్రం వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా.. గురువు అనే గౌరవంకూడాలేకుండా పాఠాలు చెబుతుంటే కామెంట్లు చేయడం, వెకిలి చేష్టలు వేయడం వంటివి చేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా తమ గురువులంటే ఎంతో గౌరవంగా ఉంటారు. ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తుంటారు. జీవింతంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతంవార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరీపేట మండలంలో ముద్దిరాల నవోదయ లేపాక్షి విద్యాలయం ఉంది. ఈ పాఠశాలలో బండిజేమ్స్ అనే టీచర్  చిత్ర లేఖనంను నేర్పిస్తుంటారు. గతంలో ఆయన.. నవోదయ, నెల్లూరులో  బోధించారు. 2016 నుంచి మద్దిరాలనవోదయలో పనిచేస్తున్నారు. ఈనెల 30 న ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. దీంతో ఆయన పూర్వ విద్యార్థులు వెరైటీగా తమ టీచర్ ను సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ లు చేశారు. వెంటనే అంతా కలిసి ప్లాన్ చేసుకుని ఒక కారు గిఫ్ట్ గా ఇస్తే ఎలా ఉంటుదని ప్లాన్ చేశారు. అనుకున్నదే మొదలు..మంచి 12 లక్షల రూపాయలు పెట్టి ఖరీదైన లగ్జరీకారును తమ టీచర్ దంపతులకు కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా శాలువ,పూలమాలతో సత్కరించారు.


Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువు పట్ల స్టూడెంట్ లకు ఉన్న గౌరవం చూసి అనేక మంది సంబరపడుతున్నారు. మరికొందరు ఇలాంటి స్టూడెంట్లు దొరకడం కూడా లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు చూపిన ప్రేమను, అనురాగం చూసి ఆటీచర్  దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter