E Buses: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీఎస్సార్టీసీ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 250 ఇ బస్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన నగరాల్లో ఇ బస్సులు తిరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంధన ధరలు(Fuel Prices)ఆకాశాన్నంటుతుండటం, భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ రవాణాపై ఆధారపడే పరిస్థితి ఉండటం కారణంగా ఏపీఎస్సార్టీసీ(APSRTC)సైతం అదే దిశగా పయనిస్తోంది. ఆర్టీసీలో తొలిసారిగా 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమమైంది. తిరుమల, తిరుపతిలో ఈ వంద ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు వీలుగా టెండర్ ప్రక్రియ పూర్తయింది. రాయితీ అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ప్రాంతాల్లో మొత్తంత 250 ఇ బస్సుల్ని అద్దె విధానంలో ప్రవేశపెట్టాలని ఆర్ఠీసీ నిర్ణయించింది. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విధి విధానాన్ని ఖరారు చేశారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ఆదేశాల మేరకు ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అద్దె బస్సుల రేట్లకు మించకుండా ఇ బస్సుల టెండర్లు ఉండాలి. అయితే విజయవాడ, కాకినాడలలో సర్వీసులకు పలు సంస్థలు డీజిల్ బస్సు ధరల కంటే ఎక్కువకు కోట్ చేశాయి. ఫలితంగా ఇ బస్సు సర్వీసుల అంశం వాయిదా పడింది. తిరుమల, తిరుపతిలలో సర్వీసులకు కూడా అశోక్ లైలాండ్, ఈవే ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కాస్త ఎక్కువకు కోట్ చేయడంతో ఆర్టీసీ ఆ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. చివరకు డీజిల్ బస్సుల ధరలకు ఎల్ 1గా నిలిచి ఈవే ట్రాన్స్ లిమిటెడ్‌కు తిరుమల-తిరుపతి 100 బస్సుల్ని ఖరారు చేసింది. తిరుమల, తిరుపతి ఇ బస్సు సర్వీసుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ప్రారంభించనున్నారు. వంద ఇ బస్సుల్లో తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో 50, తిరుపతి నుంచి కడప, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటలకు మరో 50 బస్సులు తిరగనున్నాయి. రెండవ దశలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఇ బస్సుల్ని(E Buses) ప్రవేశపెట్టనున్నారు. 


Also read: Diwali Special Trains: దీపావళికు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి