Diwali Special Trains: దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
దసరా నుంచి ప్రారంభమైన ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు దీపావళి సీజన్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. 07067 నెంబర్ కలిగిన మచిలీపట్నం–కర్నూలు సిటీ ప్రత్యేక రైలు నవంబర్ 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తిరిగి ఇదే రైలు 07068 నెంబర్‌తో నవంబర్ 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబర్ 1వ తేదీల్లో రాత్రి 8 గంటలకు కర్నూలు నుంచి బయల్దేరుతుంది.
ఇక 07455 నెంబర్‌తో మరో రైలు నర్సాపూర్–సికింద్రాబాద్ మధ్య నడవనుంది. ఈ రైలు ఈ నెల 31, నవంబర్ 7, 14 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. ఇక మరో రైలు 07456 నెంబర్‌తో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఉంటుంది. ఈ రైలు నవంబర్ 1, 8, 15 తేదీల్లో రాత్రి 10 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరిగి ఇదే రైలు 07459 నెంబర్‌తో నవంబర్ 11 ఉదయం 11 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. ఇక 08579 నెంబర్ కలిగిన ప్రత్యేక వీక్లీ ట్రైన్(Diwali Special Trains)విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉంటుంది. ఈ రైలు నవంబర్ 3, 10, 17 తేదీల్లో రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. తిరిగి ఇదే రైలు 08580 నెంబర్‌తో నవంబర్ 4, 11, 18 తేదీల్లో రాత్రి 7 గంటల 40 నిమిషాలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనుంది.
Also read: Quarantine Room: క్వారంటైన్ గది ఉంటేనే ఆ దేశానికి ఫ్లైట్ టికెట్..లేకపోతే అంతే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి