Women Protest Against Wine Shop: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం ద్వారా ఏర్పాటుచేసిన మద్యం దుకాణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతి తక్కువ ధరకే మద్యం అందిస్తామని గొప్పగా ప్రభుత్వం చెప్పగా ఆశపడి వెళ్లిన మందుబాబులు నిరాశ చెందుతుండగా.. తాజాగా మహిళలు కూడా మద్యం దుకాణాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. వైన్‌ షాప్‌ తొలగించాలని మహిళలు ధర్నా చేసిన సంఘటన గుడివాడలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై మహిళలు మండిపడ్డారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Cabinet: ప్రపంచపటంలో ఏపీని నిలబెట్టడమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు 'ఆరు విధానాలు' ఆరు అస్త్రాలు


 


గుడివాడ బేతవోలు సెంటర్‌లో విజయవాడ ప్రధాన రహదారి పక్కన మద్యం దుకాణం ఏర్పాటైంది. ఉన్నఫళంగా గురువారం మద్యం దుకాణం ప్రారంభం కావడంతో మహిళలు అవాక్కయ్యారు. మద్యం దుకాణం నివాసాల మధ్య ఏర్పాటు కావడం గమనార్హం. ఇళ్ల మధ్య వైన్‌ షాప్‌ తెరచుకోవడంతో స్థానిక మహిళలు వ్యతిరేకించారు. నిబంధనలకు విరుద్ధంగా నివాసాల మధ్య మద్యం దుకాణం ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు.

Also Read: Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత


 


స్థానిక మహిళలంతా ఒక్కటై మద్యం దుకాణానికి వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నా చేపట్టారు. వైన్ షాపులో ఏర్పాటును తప్పుబట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. నివాస గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న కుటుంబాల వారు ఇబ్బందులు పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం తాగి తాగుబోతులు గొడవలు చేస్తారని.. ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో గొడవలు జరుగుతాయని వాపోయారు. ఇక్కడ మద్యం దుకాణం కొనసాగనివ్వమని స్పష్టం చేశారు.


అయితే మహిళలు వచ్చి నిలదీయడంతో మద్యం దుకాణం నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలతో వాగ్వాదానికి దిగారు. మహిళల ఆందోళనతో గుడివాడ- విజయవాడ ప్రధాన రహదారిలో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను శాంతపర్చారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరణ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి