ఆరోగ్య శ్రీ పథకాన్ని( Arogyasri scheme )ను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆదేశించారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్య శ్రీ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని సంపూర్ణంగా పూర్తిగా అమలు చేయనున్నట్టు జగన్ చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకంపై సమీక్ష ( ys jagan review on arogyasri scheme ) నిర్వహించిన వైఎస్ జగన్..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 



లివర్ ( liver ) , బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ( Bonemarrow Transplantation ) వంటి అత్యాధునిక ఖరీదైన వైద్యం కూాడా ఇకపై ఆరోగ్య శ్రీ పథకంలో రానుంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీటికోసం తగిన ఆసుపత్రుల్ని గుర్తించి..సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికార్లను ఆదేశించారు. ఆరోగ్య శ్రీపై జగన్ నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. Also read: AP ECET 2020 counselling: ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ తేదీ పొడగింపు.. వివరాలివే


రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 కోట్ల స్మార్ట్‌ హెల్త్‌‌కార్డులు ( Smart Health cards ) జారీ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని గుర్తించామని చెప్పారు. వేయి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి వైద్యం ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాల్సిందేనని వైఎస్ జగన్ తెలిపారు. 


ఆరోగ్య శ్రీ ప్యానెల్‌ ( Arogyasri pannel hospitals ) లో ఉన్న ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా ప్రమాణాల్ని పాటించాలని జగన్ సూచించారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపు విధింగా పొందాలన్నారు. రాష్ట్రంలో టెలి మెడిసిన్ కాల్‌సెంటర్‌ను మరింతగా బలోపేతం చేయాలన్నారు. ఈ సెంటర్‌లో ప్రతి రోజూ వైద్య నిపుణుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. 


ఆరోగ్య శ్రీ ప్యానెల్ ఆసుపత్రుల్లో మంచి ఆహారం, డిశ్చార్జ్ అయిన తరువాత రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా పథకం వర్తింపచేయటం చేయాలన్నారు. Also read: Grama Sachivalayam Jobs: 770 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్