Anakapalli Loksabha: ఆ సీటులో వైసీపీ అభ్యర్థి మార్పు..! ఆయనకే టికెట్ కన్ఫార్మ్..?
Loksabha Elections 2024: ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుతోంది. నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులకు అధికార వైసీపీ.. ప్రచారంలో దూకుడు పెంచింది.
Loksabha Elections 2024: రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ పావులు కదుపుతోంది. వైట్ నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ.. 25 ఎంపీ స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. డబుల్ సెంచరీ కొడతామంటూ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించిన సీఎం జగన్.. ప్రచారంలో దూకుడు పెంచారు. కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉండగా.. ఆయనకు పోటీగా ముత్యాల నాయుడికి అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే తాజాగా ఆయనను మార్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదా
అనకాపల్లి పార్లమెంట్‌లో దాదాపు 14 లక్షల జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కాపు, వెలమ, గవర సామాజిక వర్గాల ప్రజలే 75 శాతానికి పైగా ఉంటారు. ప్రధాన పార్టీలు అన్ని కూడా ఎక్కువగా ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి. సీఎం రమేష్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బలమైన నేతను వైసీపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దూకుడుగా వ్యవహరించే ఆడారి కిషోర్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన స్థానికుడు కావడం.. సామాజిక సమీకరణలు లెక్కలు వేసుకుని టికెట్ కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు అనకాపల్లి నేతలు చెబుతున్నారు. అన్ని కుదిరితే కొత్త అభ్యర్దిగా ఆడారి కిషోర్ కుమార్ పేరు మరో రెండు రోజుల్లోనే ఉంటుందని అంటున్నారు.
సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆడారి కిషోర్.. ఆ పార్టీ తరఫున ఎంపీ టికెట్ దక్కుతుందని అనుకున్నా పొత్తుల్లో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధిష్టానం సరైన గుర్తింపునివ్వలేదని ఆడారి కిషోర్ కుమార్ సైకిల్ దిగి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఫ్యాన్ గూటికి చేరిపోయారు. టీడీపీలో ఎలాంటి పదవి ఇవ్వకున్నా.. చంద్రబాబు మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవంతో తాను పార్టీ కోసం ఎంతో సేవ చేశానని.. పదవులు ఇవ్వకపోయినా టీడీపీ కోసం ఎంతో పనిచేశానని గతంలో ఆయన చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్వయంగా వైజాగ్ విమానాశ్రయం రన్‌వేపై ఆందోళన చేయగా.. ఆయనపై కేంద్ర సాయుధ బలగాల అధికారులు కేసులు కూడా పెట్టారు. నారా లోకేష్ యువగళం యాత్రకు కూడా ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టారు. అయినా టీడీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ టికెట్ వైసీపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే ఆడారి కిషోర్ ఆ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉన్న డాక్టర్ భీశెట్టి సత్యవతి స్థానంలో ముత్యాల నాయుడు పేరును ప్రకటించగా.. తాజాగా ఆయనను మార్చే అకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఆడారి కిషోర్ పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter