Tirupati Stampede: 'ఏడుకొండలు వాడా.. స్వామి మమ్మల్ని క్షమించు.. భక్తకోటి క్షమించండి. స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు స్వామి మమ్మల్ని క్షమించు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రాథేయపడ్డారు. తిరుపతి తోపులాట సంఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు తమ కూటమి ప్రభుత్వం కారణమని ఆమె వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి చరిత్రలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirupati Stampede: మొన్న సంధ్య థియేటర్‌, నేడు తిరుపతి.. ఈ పాపం ఎవరిది?


వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో వైకుంఠ ద్వార ప్రవేశ టోకెన్ల జారీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు మృతి చెందిన సంఘటనలపై పురంధేశ్వరి స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'తిరుమల తిరుపతి చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా పాలకమండలి కఠిన చర్యలు తీసుకోవాలి' అని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

Also Read: Tirupati Stampede: తిరుపతిలో విషాదం.. వైకుంఠ ద్వార టికెట్లలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి


'తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచి వేసింది' అని పురంధేశ్వరి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. తిరుపతి సంఘటనపై యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రంలో గతంలో ఏనాడూ ఇలాంటి దుర్ఘటనలు జరగలేదు. తొలిసారి తిరుపతి చరిత్రలో ఇంతటి ఘోర విషాదం చోటుచేసుకోవడం యావత్‌ భక్త లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.