Tirupati Temple Stampede: తెలుగు రాష్ట్రాల్లో వారాల వ్యవధిలో తొక్కిసలాట సంఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటనలో మృతులు ఒకరే ఉన్నా ఆ వ్యవహారం రాజకీయం కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ తిరుపతిలో జరిగిన సంఘటనలో ఇప్పటివరకు సమాచారం అందిన ప్రకారం ఏడుగురు చనిపోయారు. మృతుల సంఖ్య పక్కన పెడితే సంఘటనలు ఒకేలా ఉన్నాయి. తొక్కిసలాట సంఘటనలకు కారణమెవరు? అమాయకుల ప్రాణం తీయడంలో తప్పేవరిదనే ప్రశ్న మెదలుతోంది.
Also Read: Tirupati Stampede: తిరుపతిలో విషాదం.. వైకుంఠ ద్వార టికెట్లలో తొక్కిసలాట.. నలుగురు మృతి
తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల కోసం తిరుపతిలో స్థానికుల కోసం టోకెన్ల జారీ ఉంచారు. టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే టికెట్ కేంద్రాల వద్ద సరిపడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు చెబుతున్న మాట. తిరుమలను గొప్పగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకోవడం కలచివేసే అంశం.
Also Read: Tirupati Temple Stampede: తిరుపతిలో ఘోర విషాదం.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య
ఏర్పాట్లలో టీటీడీ విఫలం
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో.. టికెట్ల జారీలో తిరుమతి తిరుపతి దేవస్థానంతోపాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్ల విడుదలపై తీవ్ర ఆరోపణలు రాగా.. తిరుపతి స్థానికులకు టోకెన్ల జారీ కూడా అస్తవ్యస్తంగా జరిగింది. తిరుపతిలో టోకెన్లు అందించేందుకు ఏర్పాటుచేసిన టికెట్ కేంద్రాల వద్ద టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ విషాద సంఘటన చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
నిండు ప్రాణాలు బలి
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇంతటి ఘోర విషాదం ఏనాడూ చోటుచేసుకోలేదు. సంఘటన ఎలా జరిగినా అమాయక భక్తులు మరణించడం తీవ్ర విషాదం రేపే అంశం. దైవ దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే ఏడు ప్రాణాలు పోవడం కలచివేసే సంఘటన. సంధ్య థియేటర్ అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరి తమ సొంత రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలపై చర్యలు తీసుకోరా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మెచ్చుకున్న పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తిరుమలను వివాదాలకు కేంద్రంగా మారడంతోనే ఈ సంఘటన చోటుచేసుకుందనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.