Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలే
Rains Alert: ఏపీ ప్రజానీకానికి ముఖ్యంగా రైతులకు గుడ్‌న్యూస్. వర్షాభావ పరిస్థితుల్నించి కాస్త ఉపశమనం కలగనుంది. రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: ఈ ఏడాది వాతావరణం పూర్తి వైరుధ్యంగా ఉంది. ఉత్తరాదిన తీవ్రమైన వర్షాలుంటే దక్షిణాదిలో అంతగా వర్షప్రభావం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సరైన వర్షాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి ఊరట కలగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులపాటు ఏపీలో వర్షాలు పడనున్నాయి.
ఏపీలో చాలాకాలంగా వర్షాల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్టోబర్ నెలలో అయితే ఒక్క వర్షం కూడా లేని పరిస్థితి. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పరిస్థితిలో మార్పు రానుంది. అల్పపీడనం ప్రబావంతో రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, అల్లూరి, కోనసీమ, నెల్లూరు, నంద్యాల, అనంతపరుం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది.
ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. మరోవైపు రాష్ట్రంలోకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. అందుకే కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే నిన్న చిత్తూరులో 5.5, యలమంచిలిలో 5.2, సత్తెనపల్లిలో 5.1, పెందుర్తిలో 3.2, తిరుపతిలో 3.4, ఎన్టీఆర్ జిల్లాలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also read: Chandrababu-Pawan Meet: చంద్రబాబు-పవన్ భేటీ, మేనిఫెస్టోపై చర్చ, మరోసారి పోటీ అక్కడి నుంచే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook