Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 15 వరకూ ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Heavy Rains Alert: ఏపీలో గత రెండ్రోజుల్నించి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది.
Heavy Rains Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఏర్పడనుంది. ఫలితంగా కొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ.
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభవంతో బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. ఇది కాస్తా సముద్రమట్టానికి 7.7 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉన్న ఉపరితల ద్రోణితో కలవడం వల్ల రానున్న 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాధ్ర, కోస్తాంధ్ర, ఛత్తీస్ గఢ్ వైపుకు కదలనుంది. ఫలితంగా వచ్చే రెండ్రోజులు ఏపీలోని కొన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. మరోవైపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అంతేకాకుండా బలమైన ఈదురుగాలులు కూడా వీయవచ్చు. మత్స్యకారుల్ని వేటకు వెళ్లవద్దని వాతవారణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15 వరకూ ఏపీలో వర్షాలు ఉంటాయని వెల్లడించింది.
ఇవాళ పాలకొండలో 7 సెంటీమీర్లు, ఏలూరులో 4 సెంటీమీటర్లు, చింతూరులో 3, కళింగపట్నంలో 2, పలాసలో 2, విజనగరంలో 2, పార్వతీపురంలో 2, అమలాపురంలో 2 సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook