Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. మరో మూడ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తరువాత వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్న ద్రోణి బలహీనపడినా గాలులు మాత్రం తెలంగాణవైపుకు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నవంబర్ 25న కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. అదే సమయంలో తమిళనాడు, కేరళలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం వల్ల నవంబర్ 25 నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో మరో ఆవర్తనం ఏర్పడవచ్చు. ఇది కాస్తా మరుసటిరోజు అంటే నవంబర్ 26 నాటికి అల్పపీడనంగా మారనుంది. నవంబర్ 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం దిశగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. 


ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడననున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చు. అటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీలో నిన్నటి నుంచి వాతావరణం అక్కడక్కడా మేఘావృతంగా ఉన్నా వర్షాలు మాత్రం పడలేదు. రానున్న 3 రోజుల్లో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 


హైదరాబాద్‌లో కూడా వాతావరణం మేఘావృతమై ఉంది. కానీ వర్షాలు పడలేదు. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కావచ్చు. ఉదయం వేళ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజామున పొంగమంచు రెండ్రోజుల్నించి గట్టిగా అలముకుంటోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో చలిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా.


Also read: AP Caste Census: కులగణనపై మార్గదర్శకాలు జారీ, సంక్షేమ పధకాలకు లింక్ చేస్తారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook