NTR Bharosa Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరిట రూ.4 వేల ఫించన్‌ సక్రమంగా పంపిణీ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి అనంతపురం జిల్లాలో పర్యటించి సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్ల విషయమై మంత్రి పయ్యావుల కేశవ్ వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: 'కష్టాలు, నష్టాలు ఉంటాయి.. ఆ సమయంలో నా జైలు జీవితం గుర్తుచేసుకోండి'


హంగు ఆర్భాటాలకు దూరంగా.. సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. రాయదుర్గం నియోజవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి శనివారం చంద్రబాబు చేరుకుంటారని వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి హెలిప్యాడ్‌ స్థలాన్ని, ఆంజనేయస్వామి దేవాలయాన్ని, గ్రామసభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. 

Also Read: RK Roja: షర్మిలమ్మ మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా?


 


సీఎం షెడ్యూలు ఇదే


  • శనివారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం చంద్రబాబు రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రయానికి బయల్దేరుతారు.

  • 11.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 12.25 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు.

  • 12.45 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నేమకల్లు గ్రామానికి చేరుకుంటారు.

  • గ్రామంలో 12.50 వరకు ప్రజల నుంచి అర్జీలు సీఎం చంద్రబాబు స్వీకరిస్తారు.

  • 12.50 నుంచి 1.20 గంటల వరకు కొద్దిసేపు సీఎం విశ్రాంతి తీసుకుంటారు.

  • 1.25 గంటలకు నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు.

  • 1.55 గంటల వరకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు అందిస్తారు.


గ్రామస్తులతో ముఖాముఖి
పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం కొద్దిసేపు గ్రామస్తులతో మాట్లాడుతారు. ముఖాముఖిలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇక అక్కడి నుంచి 3.45 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మళ్లీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter