RK Roja vs YS Sharmila: ప్రపంచవ్యాప్తంగా గౌతమ్ అదానీ లంచం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా రాజకీయాలు నడుస్తుండగా వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల విమర్శలకు మాజీ మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణి మండిపడ్డారు. 'మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా?' అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంలో తమ పార్టీ అధినేత స్పష్టంగా చెప్పినా కూడా షర్మిల బురద జల్లడం చేయడమే పనిగా పెట్టుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్‌చల్
అదానీ వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్‌ను షర్మిల సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ఆర్‌కే రోజా కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిలకు కొన్ని ప్రశ్నలు సంధించారు. గౌతమ్ అదానీ వ్యవహారంలో జగన్‌కు సంబంధం లేదని వివరించారు. ఈ సందర్భంగా అదానీ వ్యవహారంలో జరిగిన విషయాలను కూలంకషంగా చెబుతూనే షర్మిల జగన్ లక్ష్యంగా.. అతడి పతనమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
Also Read: YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు: వైఎస్ షర్మిల
'మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న వైఎస్ జగన్ రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్ మీద బురద జల్లుతున్నారు' అని రోజా ధ్వజమెత్తారు.
1. 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? రూ.2.14 పైసలకు ఎక్కడ విక్రయించింది?
2. అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కమ్‌ల నుంచి కొనుగోలు చేశాయి.
3. అదానీతో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదు. 2021 సెప్టెంబరు 15వ తేదీన కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ.. మనకు అంతకుముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్.. అంటే రూ.2.49కే తమ మార్జిన్‌తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా?
4. గుజరాత్.. రాజస్థాన్‌లో కానీ సోలార్ విద్యుత్ రూ.1.99కి కానీ, రూ.2.10 కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్‌పోర్టు చేసే సరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జ్ మరో రూ.1.98 కూడా పడుతుంది. ప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియదా? సెకీ మనకు ఇన్సెంటివ్‌గా, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జెస్ (ఐఎస్‌టీఎస్) మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ రూ.2.49లకే వస్తోంది.
5. గుజరాత్‌లో యూనిట్ రూ.1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు? ఎక్కడ కన్జూమ్ చేస్తున్నారన్నది చూస్తే మాన్యుఫాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్. అమ్మే డిస్కమ్‌లు మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనే వాళ్లు. అక్కడే మాన్యుఫాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ ధరలు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియదా?
6. ఇదే సెకీ.. ఇదే ఆత్మ నిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్‌గఢ్‌కు కూడా రూ.2.61 ధరకు విక్రయించింది. విద్యుత్ ధర కూడా రూ.12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు?
7. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు తిరుగుతాయి. పవన విద్యుత్ పీపీఏలు చూస్తే.. 2014–19 మధ్య 3,494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. రూ.4.84 నుంచి రూ.4.83వరకు. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్‌కు సంబంధించి.. 2,500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ.6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారు. సోలార్ ఎనర్జీని యావరేజ్‌గా రూ.5.90కి కొనుగోలు చేశారు.
మరి మా ప్రభుత్వం యూనిట్ రూ.2.49కు కొంటే అది పెద్ద తప్పా? అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్ రూ.5.90లకు కొంటే మంచివాడు.. జగన్ రూ.2.49లకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం?
8. మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనాలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్. మీరు కోరుకుంటున్నది మీ అన్న జగన్ పతనం. మీరు ఎన్ని కోరుకున్నా వైఎస్ జగన్‌కు ప్రజలు అండగా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter