YSR Congress Party: 'ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరు పోస్టులు చేసినా.. ఫార్వార్డ్ చేసినా కేసులు పెడుతున్నారని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కష్టాలు ఉంటాయి.. నష్టాలు ఉంటాయి. ఆ సమయంలో నన్ను గుర్తు చేసుకోండి' అంటూ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం జగన్ సూచించారు.
Also Read: RK Roja: షర్మిలమ్మ మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా?
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లతో శుక్రవారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం వారికి స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఓటమి నుంచి కోలుకుని పూర్తి ధైర్యంతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్‌చల్
'చంద్రబాబు ప్రభుత్వంలో క్రమపద్ధిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోంది' అని వైఎస్ జగన్ తెలిపారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో వచ్చే ఎన్నికల్లో తాము చూస్తున్నామని చెప్పారు. 'మనకు అబద్ధాలు చెప్పడం చేతగాదు. మన పాలనలో చక్కగా బట్లన్లు నొక్కాం. చంద్రబాబు కూడా అలా చేస్తాడేమోనని ఆశపడిన ప్రజలకు ఆరు నెలలు తిరగకుండానే వాస్తవం అర్థమైంది' అని వివరించారు. తమ ప్రభుత్వానికి.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు పోల్చి చూస్తున్నారని.. ప్రతి ఇంట్లో ఈ అంశంపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులకు భరోసానిస్తూ వైఎస్ జగన్ ఇలా మాట్లాడారు. 'మనలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ప్రతిపక్షంలో ఉండడంతో కష్టాలు ఉంటాయి.. నష్టాలు ఉంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు ఒక పరీక్ష. కష్టమొచ్చిన సమయంలో నన్ను గుర్తు చేసుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. చివరకు ప్రజల అండగా ముఖ్యమంత్రి అయ్యా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. 'సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తా. ప్రతి బుధ, గురువారం జిల్లాల్లోనే ఉంటా. రెండు రోజుల కార్యకర్తలతో మమేకం అవుతా. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తా' అని ప్రకటించారు. 'కార్యకర్తలతో జగనన్న. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తాం' అని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter