Madanapalle Road Accident: పండగ పూట విషాదం.. మదనపల్లె రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Madanapalle Road Accident: చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా... మార్గమధ్యలోనే ఒకరు మృతి చెందారు.
Madanapalle Road Accident: చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా... మార్గమధ్యలోనే ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఇస్మాయిల్ (21), సిద్ధిక్ (21) అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం (జనవరి 15) రాత్రి మదనపల్లె నుంచి చంతపర్తి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట ఎదురుగా మరో బైక్ దూసుకురాగా... రెండు బైక్స్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇస్మాయిల్, సిద్ధిక్‌తో పాటు శ్రీనివాసులు (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి 108 అంబులెన్స్‌కి సమాచారమిచ్చారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని... వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మార్గమధ్యలోనే మృతి చెందారు.
ఇస్మాయిల్, సిద్దిఖ్‌లను మదనపల్లె ఆసుపత్రిలో చేర్చగా... అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ ఇద్దరూ శనివారం (జనవరి 15) తెల్లవారుజామున మృతి చెందారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం (జనవరి 14) పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చేపల లారీ బోల్తా పడిన ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే.
భీమడోలులో లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు :
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంలో భీమడోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో (Road Accident) బస్సులో మొత్తం 25 మంది ఉన్నారు. బస్సు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read: Indian Army Day 2022: ఇవాళ ఇండియన్ ఆర్మీ డే, 'జనవరి 15'నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి