Maganti Ravindra's death: ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మృతి నుంచి ఇంకా ఆ కుటుంబం తేరుకోకముందే.. మంగళవారం మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మృతి (Maganti Ravindranath Chowdary found dead) చెందారు. అంతకుముందుగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాగంటి రవీంద్రను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో చికిత్స పూర్తి కాకుండానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మాగంటి రవీంద్ర ఆసుపత్రికి అందుబాటులో ఉండటం కోసం ఏలూరు వెళ్లకుండా హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో ఓ రూమ్ తీసుకుని ఉంటున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే మంగళవారం హఠాత్తుగా మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి రవీంద్ర.. రక్తపు వాంతులు (Blood vomitings) చేసుకున్నారని, ఆయనకు వైద్య సహాయం అందించేలోపే మరణించారని హోటల్ సిబ్బంది చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మృతి గురించి హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మాగంటి రవీంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని తెలుస్తున్నప్పటికీ... మాగంటి రవీంద్ర మృతి విషయంలో మరిన్ని భిన్నమైన కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 


Also read: AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు


హోటల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న మాగంటి రవీంద్రను కుటుంబ సభ్యులు సమీపంలోని యశోదా ఆసుపత్రికి తరలించారని.. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని అక్కడి వైద్యులు ధృవీకరించారనేది మాగంటి రవీంద్ర మృతి విషయంలో వినిపిస్తున్న మరో వాదన. మాగంటి రవీంద్ర మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు ఏం చెబుతారు, మాగంటి బాబు కుటుంబం ఏం చెబుతుందనేదే ఇంకా తెలియాల్సి ఉంది.


మాగంటి రవీంద్ర మృతికి కారణాలు ఏవైనా.. మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను కోల్పోయిన మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మార్చి 7న మాగంటి రాంజీ అనారోగ్యంతో మృతి (Maganti Ramji's death news) చెందగా.. జూన్ 1న మాగంటి రవీంద్రనాథ్ మృతి (Maganti Ravindra's death news) చెందిన తీరు మాగంటి బాబు సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మాగంటి రవీంద్ర మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Also read : Covid Vaccination: వ్యాక్సినేషన్‌లో ఏపీ అరుదైన ఘనత, కోటిమందికి వ్యాక్సిన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook