Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడిలో..భారీ ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య కోటి దాటింది.
కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీ ప్రభుత్వం (Ap goverment) పగడ్బందీ చర్యలతో ముందుకుపోతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకై పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలతో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. వ్యాక్సిన్ కొరత ఉన్న సమయంలో సైతం వ్యాక్సినేషన్ భారీ ఎత్తున చేస్తోంది. రికార్డు స్థాయిలో కోటిమందికి మొదటి, రెండవ డోసు వ్యాక్సిన్ అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి వ్యాక్సిన్ అందించింది. వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమంలో దేశ సగటును దాటేసింది ఏపీ. ఏపీలో ఇప్పటి వరకూ మొదటి, రెండవ డోసు తీసుకున్నవారు 1 కోటి 17 వేల 712 కు చేరారు. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 74 లక్షల 92 వేల 944 మంది ఉన్నారు.స్పెషల్ డ్రైవ్ ద్వారా రెండవ డోసు తీసుకున్నవారి సంఖ్య 25 లక్షల 24 వేల 768కు చేరుకుంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నియంత్రణకై అనునిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ చికిత్సకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తున్నారు. రాష్ట్రానికి సకాలంలో కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ అందేలా వ్యూహం రచించారు. తక్కువకాలంలోనే కోటిమందికి వ్యాక్సిన్ అందించారు.
Also read: AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook